VKB: ప్రభుత్వ పని దినాలలో విద్యుత్ సరఫరా మరమ్మతులను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు విద్యుత్ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. కుల్కచర్ల మండలంలో విద్యుత్ మరమ్మతులు నిమిత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.