W.G: శాస్త్రీయ వ్యవసాయంతో రైతులకు గిట్టుబాటు అవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పరచిన ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమం సోమవారం పెదఅమీరంలో నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం సూచించిన పంచసూత్రాలను వివరించారు. పోషకాలను పెంపొందించేందుకు మెళుకువలను రైతులకు వివరించారు.