MLG: కార్మిక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించే వారోత్సవాల వాల్ పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ దివాకర సోమవారం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల భీమా పెంచిందని తెలిపారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్, జిల్లా కార్మిక శాఖ సహాయ అధికారి వినోద పాల్గొన్నారు.