KNR: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో జీఎన్ఎన్ఎస్ కృషి విజ్ఞాన్ కేంద్రం ఆధ్వర్యంలో అజీమ్ ప్రేమ్ జీ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టులో భాగంగా వరి పంటపై ఫీల్డ్ మేళా ఇవాళ జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకత, వివిధ పంటలలో పాటించాల్సిన విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుమార్, BRC ఇంఛార్జ్ మురళీధర్ పాల్గొన్నారు.