CTR: ద.అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని APSDMA వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా మారుతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో నేడు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో వర్షాలు పడుతాయని తెలిపారు.