KDP: కలెక్టరేటులోని సభా భవనంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు DRO విశ్వేశ్వర నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కార మార్గం చూపుతారన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్ స్థాయిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు.