NLG: జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,504 మందికి గాను, 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 60 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. తగిన సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామన్నారు.