కర్నూలు: కోసిగి మండలంలోని రౌడీ షీటర్లు జాగ్రత్తగా ఉండాలని సీఐ మంజునాథ్, ఎస్సై రమేశ్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం కోసిగి పోలీస్ స్టేషన్లో వివిధ గ్రామాల రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, సామాజిక, శాంతి భద్రతల ప్రాముఖ్యతను వివరించారు. కలహాలు, విభేదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు.