ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 29న జిల్లా కేంద్రంలో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తదితరులు ఉన్నారు.