MDK: మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఎస్సై పోచయ్య తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఎస్సై మాట్లాడుతూ..మోటార్ వెహికిల్స్ యాక్ట్–1988 ప్రకారం.. 18 ఏళ్లు నిండని వారు వాహనం నడపడం నేరమని ఆయన స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా రూ.25,000 వరకు జరిమానా, వాహనం రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.