కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని ఆదివారం రిలే నిరాహార దీక్షలో భాగంగా కార్మికులు కళ్లకు నల్లబ్యాడ్జీలను కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కార్మికులుగా పని చేస్తూ మృతి చెందిన వారి స్థానంలో కుటుంబ సభ్యులను నియమించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.