SDPT: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సంబరాలు బెజ్జంకిలో అంకురార్పణలాగే ప్రారంభమై, భక్తి ప్రబోదంతో ముగిశాయి. స్థానిక సత్యసాయి భజన మండలి, సత్యసాయి గురుకుల విద్యానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తజన సందోహం ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఉదయం సుబ్రహ్మణ్య ముహూర్తంలో ప్రత్యేక పూజలు, వేదపారాయణంతో ఉత్సవాలు శుభారంభం అయ్యాయి.