సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద ‘సత్యన్న సేన’ సభ్యుల ఆధ్వర్యంలో నేడు ఏడుగురు గర్భిణీ స్త్రీలకు ఆరు రకాల పౌష్టిక ఆహారాన్ని అందించారు. కరోనా సమయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరు, ప్రతి నెలా గర్భవతులకు ప్రసవం అయ్యేవరకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ స్ఫూర్తి ప్రదాతఅని నిర్వాహకులు తెలిపారు.