బెంగళూరులో జరిగిన ‘ది సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్’ ముగింపు వేడుకలకు AP మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సర్జ్ స్టేబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ గుర్రపు స్వారీ ఫైనల్ పోటీలు జరిగాయి. అనంతరం వీరిద్దరూ విజేతలకు బహుమతులను అందించారు. ప్రస్తుతం ఇరువురి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.