VZM: ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలనే ఉద్దేశంతో వచ్చిన మావోయిస్టు నేతలను ఆసుపత్రి నుండి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ పేరిట చంపటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు ధ్వజమెత్తారు. కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.