NTR: ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాచవరం ఎస్సై దుర్గ మహేశ్ రౌడీషీటర్లను హెచ్చరించారు. నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవని, అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంటుందన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై కొత్త సంవత్సరంలో రౌడీషీట్లను తొలగిస్తామన్నారు. అలాగే ఉపాధి లేని వారికి ఉపాధి కల్పిస్తామని సూచించారు.