SRCL: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నందున ఆదివారం సాధారణ భక్తులకు ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఎస్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా స్వామివారి దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నారు. భక్తులు ఎస్ఈడీ స్క్రీన్ ద్వారా స్వామివారిని దర్శించుకుని, అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.