AKP:ఎలమంచిలి మున్సిపాలిటీ కొక్కిరాపల్లిలో వేంచేసియున్న దుర్గాదేవి అమ్మవారి జాతరను ఈనెల 25న వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.