కోనసీమ: భోపాల్లో జరిగిన 52వ జాతీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రాజెక్టు సత్తా చాటింది. ఇక్కడి నుంచి ఎంపికైన ‘ఈజీ మెషిన్ టూల్’ అత్యంత ప్రజాదరణ పొంది ‘ బెస్ట్ పబ్లిక్ రెస్పాన్స్ ‘ అవార్డును కైవసం చేసుకుంది. జిల్లాకు వరుసగా తొమ్మిదోసారి జాతీయ అవార్డు దక్కడం గర్వకారణమని జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు.