VZM: మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిధులు అంతా సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.