ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని అంకోలి రోడ్డు పక్కన ఉన్న భీమన్న దేవుని షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం భీమన్న దేవుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.