బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమపై నమోదైన కేసును బెంగళూరు హైకోర్టు కొట్టిపారేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ హేమ.. ‘నేను కేసు గెలిచాను.. కానీ అమ్మను కోల్పోయాను’ అని చెప్పింది. తనపై వచ్చిన ట్రోల్స్ వల్ల అమ్మ మానసికంగా కృంగిపోయిందని, స్ట్రోక్ వచ్చి చనిపోయిందని తెలిపింది. ఒకవేళ ఈ ట్రోలింగ్ వల్ల తాను చనిపోయింటే ఈ తీర్పు వచ్చి ఉపయోగం లేదు కదా? అని ఆవేదన వ్యక్తం చేసింది.