KDP: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఏవీధి చూసినా మురికిమయంగా మారాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. ప్రజలు ప్రవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.