NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమచేయడం పట్ల పోచారంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు.