NLR: కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ లేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు NMC అధికారులు మరోసారి అవకాశం కల్పించారు. BPS పథకంలో భాగంగా 1985 నుంచి 2025 ఆగస్టు వరకు అనధికారికంగా అనుమతికి మించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేందుకు వచ్చే ఏడాది మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1113, 7981651881ను సంప్రదించాలన్నారు.