ELR: భీమడోలు మండలం పూళ్ల రైల్వేగేటు (కోడూరుపాడుకు వెళ్లే) వద్ద హైవేపై శనివారం సాయంత్రం రెండు బైక్లు ఢీకొట్టుకున్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. ఘటనలో కైకరం గ్రామానికి చెందిన ప్రసాద్, కొమ్మరకు చెందిన ప్రవీణ్ గాయపడ్డారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.