WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో రేపు MLA దొంతి మాధవరెడ్డి పర్యటించనున్నారు. స్థానిక రైతు వేదికలో మధ్యాహ్నం 12 గంటలకు మండల మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు మండల అధ్యక్షుడు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.