VSP: శ్రీ సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ కేజీహెచ్‌లో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి ముఖ్య అతిథిగా పాల్గొని సాయిబాబా శాంతి, ప్రేమ సందేశాలను గుర్తుచేశారు. పట్టా ఫౌండేషన్ అధ్యక్షుడు పట్టా రమేష్ బాబు మాట్లాడుతూ.. స్వామి స్ఫూర్తితో 20 ఏళ్లుగా సేవ చేస్తున్నామని తెలిపారు.