»Chandrababu Naidu Mahanadu Program Speech Activist Sings A Lie 2023
Chandrababu Naidu: అందుకే కార్యకర్త పాడే మోశాను
ఏపీలోని రాజమండ్రిలో మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, పార్టీ జెండా ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రెండు రోజులు కొనసాగనుంది.
తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో నిర్వహిస్తున్న మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా మొదలైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీడీపీ పార్టీ జెండాను ఎగుర వేసి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాదయాత్రకు విరామం ప్రకటించిన యువనేత నారా లోకేష్ సైతం హాజరయ్యారు. దీంతోపాటు ఇవాళ, రేపు జరగనున్న ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక వేల మంది హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మొదట కార్యకర్తల గురించి భావోద్వేగంతో మాట్లాడారు. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేనే లేదని అన్నారు. ఏ కష్టమోచ్చిన కూడా చంద్రన్న మీకు అండగా ఉంటాడని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినా రాకున్నా సాయం చేస్తానని వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఈ మహానాడు సాక్షిగా మీకు తోడుగా ఉంటానని చెప్పారు. మీరు చేసిన త్యాగాలు జీవితంలో ఎప్పుడు కూడా మరవనని చంద్రాబాబు(Chandrababu ) అన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ క్రమంలో ఎంతో మందిని అరెస్టు చేశారని అయినా కూడా వెనక్కి తగ్గలేదని అన్నారు. ఒకనొక సందర్భంలో జై జగన్ అనాలని మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అనే కార్యకర్తపై దాడి చేసి హతమార్చగా..అతని పాడే మోశానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పేదవారికి పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలోని వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని అనూహ్యంగా టీడీపీ రెండు రకాలుగా ప్రకటించింది. ప్రతినిధుల సభ, బహిరంగ సభలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. మహానాడు తొలిరోజు ప్రజాప్రతినిధుల సభ జరగుతుండగా. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్య నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతినిధుల సభకు 15,000 మందిని ఆహ్వానించారు. ఇక ఆదివారం జరిగే భారీ బహిరంగ సభకు 15 లక్షల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
41 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగుదేశం నిర్వహిస్తున్న 32వ మహానాడు ఇది. మహానాడు సందర్భంగా రాజమండ్రిలో భారీ సభ పెడితే వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుందని టీడీపీ నేతలు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. 1993లో ఎన్టీఆర్ నేతృత్వంలో రాజమండ్రిలో ప్రజాగర్జన పేరుతో సభ జరిగింది. ఆ సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. 2006లో మహానాడు జరిగినా ప్రతినిధుల సభ మాత్రమే జరిగింది. ఈసారి రెండింటినీ హ్యాండిల్ చేస్తోంది.
ఇక మొదట 1982లో ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్లో తొలి మహానాడు నిర్వహించారు. తర్వాత 1986, 1987, 1990, 91, 92, 93, 94, 1998, 99, 2004, 2005, 20009, 2010, 2011, 2012, 13, 14, హైదరాబాద్ వేదికగా మహానాడు 15గా నిలిచింది. 1983, 1988, 2000 సంవత్సరాల్లో విజయవాడలో మహానాడు నిర్వహించారు. 1984, 2001, 2017, 2018లో విశాఖలో ఉత్సవాలు జరిగాయి. 2002లో వరంగల్లో, 2003లో తిరుపతిలో, 2007, 2016లో ఆన్లైన్లో మహానాడు, 2016లో మహానాడు నిర్వహించారు. కరోనా ప్రభావం కారణంగా 2020, 21లో. 2022లో జరిగే మహానాడుకు ఒంగోలు వేదికగా.. వివిధ కారణాలతో తొమ్మిదేళ్లుగా మహానాడు జరుపలేదు.