Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో జోరు వాన (Delhi Rains) కురుస్తోంది. ఈదరుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఉదయం నుంచే వాన పడటంతో.. గత కొన్నిరోజులుగా ఎండ వేడితో అల్లాడిన జనానికి ఉపశమనం లభించినట్టు అయ్యింది. రహదారులపై భారీ వృక్షాలు (trees) నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు (power) అంతరాయం కలిగింది. ఇటు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్‌లో వర్ష ప్రభావం ఉంది. మంగళవారం వరకు వర్షం పడనుందని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మరో రెండు గంటల్లో కూడా 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఢిల్లీ (delhi) పరిసరాల్లో వర్షం పడుతోందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ (traffic jam) కాకుండా చూడాలని.. అలాగే ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.
భారీ వర్షంతో ఢిల్లీలో (delhi) వాతావరణం బాగోలేదు. దీంతో విమాన రాకపోకలకు (Flights Operations) అంతరాయం కలిగింది. నాలుగు విమానాలను జైపూర్ (jaipur) మళ్లించారని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఢిల్లీలో ఈ వారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. టెంపరేచర్ పెరగడంతో విద్యుత్‌కు (power) డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు వాతావరణం చల్లబడటంతో మరో రెండు, మూడు రోజుల వరకు పవర్ (power) డిమాండ్ అంతగా ఉండకపోవచ్చు. ఢిల్లీలో శుక్రవారం మాత్రం 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ మరునాడే వర్ష బీభత్సం కొనసాగుతోంది.