JN: లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు గ్రామ కార్యదర్శితో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ఓటర్ల జాబితా సవరణ, తొలగింపుపై సెక్రెటరీకి పలు సూచనలు ఇచ్చారు. ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని కార్యదర్శిని కోరారు. ఇందులో గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల రాహుల్, సుధీర్ రెడ్డి, లక్ష్మయ్య, సతీష్ తదితరులున్నారు.