AP: సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని, ఆయన బోధనలు లక్షలమందికి మార్గం చూపాయని కొనియాడారు. సత్యసాయి సందేశంతో కోట్లమంది భక్తులు మానవసేవ చేస్తున్నారని, సత్యసాయి ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందించారని గుర్తుచేశారు.