KRNL: రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీడీఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఇవాళ విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ తెలిపారు.