ADB: సిబ్బందికి క్రమశిక్షణ, నీతి, నిజాయితీ తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ సూచించారు. ఈ మేరకు వార్షిక తనిఖీలలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం SP సందర్శించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో చెట్లను నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని తెలిపారు.