దుబాయ్ ఎయిర్ షోలో భారత తేజస్ యుద్ధ విమానం కూలిన ఘటనలో పైలట్ అసువులు బాసినట్లు ఐఏఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి పట్ల ఐఏఎఫ్ విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. విమానం కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.