పాక్ ఫైసలాబాద్‌లో ఓ గ్లూ(గమ్) తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి 15 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటన తర్వాత ఫ్యాక్టరీ యాజమాని పరారవగా.. మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.