ASR: ఈనెల 24వరకు ప్రపంచ యాంటీ మైక్రోబయల్(ఏఎమ్ఆర్)అవగాహనా వారోత్సవాలు నిర్వహిస్తామని పాడేరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.హేమలత తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పలువురు వైద్యులు, సిబ్బందితో పాడేరులో ర్యాలీ నిర్వహించారు. వైద్యుల సలహాలు లేకుండా మందులు వాడకూడదని ప్రజలకు సూచించారు. జలుబు, దగ్గు తదితర చిన్న విషయాలకు రోజూ మందులు వాడకూడదని సూచించారు.