భారత నౌకా దళానికి చెందిన INS సుకన్య నౌక శ్రీలంక రాజధాని కొలంబో పోర్టులో లంగరేసింది. భారత్-శ్రీలంక మధ్య కార్యక్రమాల్లో భాగంగా తమ తీరానికి చేరిన ఈ నౌకకు శ్రీలంక నౌకాదళం ఘన స్వాగతం పలికింది. అలాగే, ఈ నౌక కొలంబో నౌకాశ్రయాన్ని ఈరోజు వీడనున్నట్లు తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన PNS SAIF నౌక కూడా కొలంబో పోర్టుకు చేరుకుని వెనుతిరిగింది.