MHBD: ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషినల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 5 నుంచి 8వ తరగతి బాలబాలికలకు రూ. 1000 నుంచి రూ.1,500 వరకు, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.3,500 వరకు, ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులకు రూ.7,000 వరకు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.