మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర ఆవహించడం చాలామందికి ఉండే సమస్య. దీన్ని అధిగమించాలంటే మధ్యాహ్నం తేలికపాటి ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు తగ్గించాలి. భోజనం చేశాక కనీసం 5-10 నిమిషాలు నడవండి. ఇది జీర్ణక్రియకు సహాయపడి, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. వీలైతే 15-20 నిమిషాల చిన్న కునుకు(Power Nap) తీసుకోండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది.