ATP: జేఎన్టీయూఏ పరిధిలో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నిర్వహించిన ఫార్మాడీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆచార్య నాగప్రసాద్ నాయుడు, పరీక్షల విభాగ కంట్రోలర్ ఆచార్య శివకుమార్ తదితరులు బుధవారం విడుదల చేశారు. ఫార్మాడీ మొదటి సంవత్సరం రెగ్యూలర్, సప్లిమెంటరీ ఫలితాలు, ఐదో ఏడాది సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు ప్రకటించారు.