PDPL: రామగుండం-B పవర్ హౌస్ గడ్డ సమీపంలోని అంజనాద్రి గుట్టపై రమా సహిత శ్రీ సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్-మనాలి దంపతుల ఆధ్వర్యంలో వందలాదిమంది పుణ్య దంపతులు పాల్గొని వ్రతం నిర్వహించారు. త్వరలో ఈ గుట్టపై 108 అడుగుల ఎత్తు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.