MDK: చిలిపిచేడ్ మండలం జగ్గంపేటలో అంగన్వాడీలో భద్రపరిచిన అంగన్వాడీ రికార్డులను గుర్తుతెలియని వ్యక్తులు తగల బెట్టారని అంగన్వాడీ టీచర్ షహనాజ్ భేగం తెలిపారు. టీచర్ వివరాల ప్రకారం.. 1987 నుంచి ఉన్న రికార్డులను రూమ్లో భద్రపరచగా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అన్ని కాలిపోయాయని చెప్పారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.