ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామం నుంచి చింతలపూడికి వచ్చే దారిలో ఉన్న బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. అల్లంశెట్టి సత్యనారాయణను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 10 మద్యం క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.