KKD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్లలో పేదలకు అందించే భోజనం నాణ్యత ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండేలా చూడాలని కాకినాడ ఇంఛార్జ్ కమిషనర్ కె.టి. సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు