CTR: తవణంపల్లి మండలంలోని పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పూతలపట్టు MLA డా.మురళీ మోహన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది పనితీరు పరీక్షించి అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో ఉద్యోగులు సంతకం చేయలేదని గుర్తించారు. అటు సిబ్బంది పనితీరుపై స్థానిక ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు.