TG: స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదన్న నిబంధనను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఎంతమంది సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం ఉంది. పోటీచేయాలని ఆసక్తి ఉండి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఆశావహులకు ఈ ఆర్డినెన్స్ కొత్త అవకాశాలను కల్పించనుంది.