ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఇక్కడి ప్రజావేదికలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నియోజకవర్గంలోని మాలధారుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలతో పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అల్పాహార విందు అందించారు.