BDK: అశ్వాపురం మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మరేళ్లపాడు నుంచి తుమ్మల చెరువు వరకు ఎత్తిపోతల పథకం పనులను ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పని నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వారితోపాటు మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.