కరీంనగర్: జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో సోమవారం GNNS– KVK ఆధ్వర్యంలో అజీమ్ ప్రేమజీ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగుపై క్షేత్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా KVK శాస్త్రవేత్త విజయ్ కుమార్, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ కుమార్, BRC ఇంఛార్జ్ మురళీధర్ నేతృత్వంలో ఫీల్డ్ డే కార్యక్రమం సాగింది.